Poonam Pandey News: పూనం పాండే చేసిన రచ్చ అంత, ఇంతా కాదు. ఏకంగా తను చనిపోయినట్టు వచ్చిన వార్త తో అంతా షాక్ కి గురయ్యారు. పూనం పాండే 32 ఏజ్ లో సర్వికల్ క్యాన్సర్ తో చనిపోయినట్టు వచ్చిన వార్తలు అంత అబద్దం అని, తనే ఈ రోజు స్వయంగా ఒక వీడియో విడుదల చేసి అందరిని ఆశ్యర్య పరిచింది.
![](https://i0.wp.com/theesportsindia.in/wp-content/uploads/2024/02/poonam-pandey-latest-news-instagram-video.png?resize=1170%2C658&ssl=1)
ప్రముఖ బాలివుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే బ్రతికే ఉంది! ఆమె మరణ వార్త (Poonam Pandey Death News) ఫిబ్రవరి 2, 2024న బయటకు వచ్చింది, ఈ వార్త తెలిసి అందరూ దిగ్భ్రాంతికి గురి అయ్యారు. అయితే ఇప్పుడు స్వయంగా పూనమ్ పాండే మరణంపై వచ్చిన పుకార్లకు స్వస్తి పలికింది. తను ఎందుకిలా చేయల్సివచ్చిందో మరియు గర్భాశయ క్యాన్సర్ గురించి ఒక వీడియోను విడుదల చేసింది.
పూనమ్ ఇంకా ఇలా రాశారు, “సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్), ఇతర క్యాన్సర్ల మాదిరిగానే పూర్తిగా నివారించదగినది. ఈ సమస్యను ముందుగానే గుర్తించి HPV టీకా తీసుకోవడం వలన . ఈ వ్యాధితో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా వుంటారు. గర్భాశయ క్యాన్సర్ మీద మహిళలలో అవగాహన కల్పించడానికే నేను ఇదంతా చేసానని చెప్పారు”.
అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ ఈ విషయమై స్పందించారు. పూనం పాండే ఇలా చేయడంలో నాకేం తప్పు అనిపించడం లేదు అంటూ ట్విట్టర్ లో తనని ఏకంగా పోగిడేసాడు. ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్ తాజాగా వైరల్ అవుంతుంది. “హే పూనం పాండే ఈ సమస్యపై అందరి దృష్టిని ఆకర్షించడానికి మీరు అవలంబించిన ఈ విపరీతమైన పద్ధతి కొంత విమర్శలకు దారితీయవచ్చు, కానీ దీనీ వెనకున్న మీ ఉద్దేశాన్ని ఎవరూ ప్రశ్నించలేరు .. సర్వైకల్ క్యాన్సర్‌పై చర్చ ఇప్పుడు అంతటా ట్రెండింగ్‌లో ఉంది మీ ఆత్మ లాగే మీరు చాలా అందమైనవారు. మీరు ఎప్పుడు ఆరోగ్యంతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.
Poonam Pandey Instagram Video
Poonam Pandey Instagram video viral after his fake death news.
Ramgopal varma thopu
Hey, cool post You can check if there’s a problem with your website with Internet Explorer. Because of this issue, many readers will overlook your excellent writing because IE is still the most popular browser.